Thursday, December 19, 2024

పసిడికి తగ్గిన గిరాకీ

- Advertisement -
- Advertisement -

ముంబై: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 17 శాతం తగ్గి 112.5 టన్నులకు పరిమితమైంది. ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరగడంతో పాటు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కూడా పసిడి కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్లుజిసి) తాజా నివేదిక పేర్కొంది. 2022 మార్చితో ముగిసిన మూడు నెలల్లో గోల్డ్ డిమాండ్ 135.5 టన్నులుగా నమోదైంది.ఈ ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలో స్వర్ణాభరణాల విక్రయాలు 78 టన్నులకు తగ్గాయి.

గత ఏడాదిలో ఇదే కాలానికి 94.2 టన్నుల బంగారు నగల అమ్మకాలు జరిగాయి. కొవిడ్ కాలాన్ని మినహాయిస్తే, మొదటి త్రైమాసికంలో ఆభరణాల గిరాకీ 100 టన్నుల దిగువన నమోదవడం ఇది నాలుగోసారి. ఈ జనవరి-మార్చి కాలానికి బంగారం అమ్మకాల విలువ వార్షిక ప్రాతిపదికన 9 శాతం తగ్గి రూ.56,220 కోట్లకు పరిమితమైంది. అందులో బంగారు ఆభరణాల విక్రయాలు సైతం 9 శాతం తగ్గుదలతో రూ.39,000 కోట్లుగా నమోదయ్యాయి. ఈ మార్చితో ముగిసిన మూడు నెలల్లో మొత్తం గోల్డ్ రీసైక్లింగ్ 25 శాతం పెరిగి 34.8 టన్నులకు చేరుకుంది. ఈ తొలి త్రైమాసికంలో దేశంలోకి 134 టన్నుల బులియన్ దిగుమతులు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News