Sunday, November 24, 2024

లడ్డూ అపవిత్రంపై లోతైన విచారణ చేస్తాం: సిట్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ విచారణ చేపట్టింది. తిరుపతి పోలీస్ అతిథిగృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడి సిట్ సభ్యులు విచారణ చేపడుతున్నారు. డిఐజి గోపీనాథ్ జెట్టి, ఎస్‌పి హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో దర్యాప్తు చేశారు. అదనపు ఎస్‌పి వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టనున్నారు. టిటిడి ప్రొక్యూర్‌మెంట్ జిఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ పరిశీలిస్తుంది. టిటిడి బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం టిటిడి ఇఒ శ్యామలరావును సిట్ సభ్యులు కలువనున్నారు. ఇఒను అడిగి పూర్తి వివరాలను సిట్ సభ్యులు తెలుసుకోనున్నారు.

కల్తీనెయ్యి వ్యవహారంపై తమిళనాడుతో పాటు దుండిగల్‌లోని ఎఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థను సిట్ పరిశీలించనుంది. తిరుమలలో లడ్డూ తయారీ ముడిసరుకులు, లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను అధికారులు ప్రశ్నించనున్నారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు సిట్ బృందం పరిశీలించనుంది. నెయ్యి సరఫరాపై టిటిడి, ఎఆర్ డెయిరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనున్నారు.

లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు సిట్ కు బదిలీ చేశారు. నెయ్యి సరఫరా చేసిన ఎఆర్ డెయిరీపై విచారణ నిర్వహిస్తామన్నారు. సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నామని, కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని, లడ్డూ అపవిత్రంపై లోతైన విచారణ చేస్తామని సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News