Sunday, March 30, 2025

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్  డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యావతి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో మెహర్ రమేష్ ఇంట్లో త్రీవ విషాదఛాయాలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ మెహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు.

సత్యవతి మరణ వార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు పవన్ కళ్యాణ్. తన చిన్నతనంలో డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, పాఠశాల రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళమని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News