Monday, December 23, 2024

దీపక్ చాహర్ ఔట్

- Advertisement -
- Advertisement -

ముంబై: టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బిసిసిఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్ క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ప్రపంచకప్‌కు దూరమయ్యారు. ఇక తాజాగా దీపక్ చాహర్ కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రపంచకప్ కోసం దీపక్ చాహర్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. అయితే బుమ్రా గాయం బారిన పడడంతో మహ్మద్ షమి, దీపక్ చాహర్‌లకు టీమిండియాలో చోటు కల్పించాలని బిసిసిఐ భావించింది. అయితే గాయం కారణంగా దీపక్ ప్రపంచకప్‌లో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వరల్డ్‌కప్ జట్టులో షమి చేరడడం దాదాపు ఖాయమైంది. ఇక శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లను ప్రపంచకప్ కోసం స్టాండ్‌బై బౌలర్లుగా ఎంపిక చేశారు. త్వరలోనే వీరు ఆస్ట్రేలియాకు చేరుకుంటారు. కాగా బుమ్రా స్థానంలో మరో సీనియర్ బౌలర్ షమికి చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న షమి ప్రస్తుతం వంద శాతం ఫిట్‌నెస్‌ను సాధించాడు. దీంతో అతను వరల్డ్‌కప్ జట్టులో చేరడం లాంఛనంగా మారింది. త్వరలోనే షమి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనున్నాడు.

Deepak Chahar ruled out of T20 World Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News