Monday, December 23, 2024

దీపారాధన ఎందుకు చేస్తాం?

- Advertisement -
- Advertisement -

సర్వసాధారణంగా ప్రతి ఇంట్లోనూ భగవత్‌ సాన్నిధ్యంలో(దైవపీఠంవద్ద) దీపారాధన చేయడం నిత్యకృత్యం. కొన్ని గృహాల్లో ప్రాతఃకాలంలోనూ, మరికొన్నింటిలో సాయం సంధ్యాసమయంలోనూ, ఇంకా కొన్ని ఇళ్లల్లో ప్రాతః, సాయం సంధ్య రెండు వేళల్లోనూ దీపారాధన చేస్తుంటారు. మరికొన్ని గృహాల్లో నిరంతరం దీపారాధన చేయడం చూస్తుంటాం. దీనినే అఖండ దీపారాధన అంటారు. అన్ని శుభకార్యాలు దీపారాధనతోనే ప్రారంభమవుతాయి. ఆయా కార్యక్రమాలను దీపారాధనతో ప్రారంభించి కార్యక్రమం పూర్తయ్యే వరకు కొండెక్కకుండా(ఆరిపోకుండా) జాగ్రత్త పడతారు.

వెలుతురు జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నం. పరమేశ్వరుడు జ్ఞాన ప్రదాత. అంటే చైతన్యమూర్తి, తేజోరూపం. జ్ఞానాలలన్నింటినీ చైతన్యపరిచి ప్రకాశింపజేసేవాడు. అందువల్ల దీపారాధన అంటే భగవంతుడిని పూజించడమే. చుట్టూ ఆవరించిన చీకటిని వెలుతురు ఎలా పారదోలుతుందో అలాగే అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానం హరిస్తుంది. శాశ్వతమైన ఆత్మ సంపదే బాహ్య అనుభూతుల్ని సాధించగలుగుతుందని జ్ఞానం ప్రబోధిస్తుంది. అందుకే అన్ని సంపదల్లోకి ఉన్నతమైన జ్ఞాన సముపార్జన కోసం దీపారాధన చేస్తాం.

Deeparadhana ela cheyali

మరి బల్బ్, ట్యూబ్‌లైట్‌తో దీపారాధన ఎందుకు చేయం? ఆ వెలుతురు కూడా చీకటిని హరిస్తుంది కదా.. అయితే, సంప్రదాయబద్ధంగా నూనెతో దీపారాధన చేయడంలో ఆధ్యాత్మిక సార్థకత కూడా దాగి ఉంది. దీపారాధనకు ఉపయోగించే నూనెలేదా నెయ్యి అనేవి మన వాసనలు లేదా వ్యతిరేక ఆలోచనలు, మరియు పాపం, అహంకారాలకు చిహ్నాలు. ఆధ్యాత్మిక జ్ఞానంతో దీపారాధన చేయడం వల్ల వాసనలు నెమ్మదిగా కరిగిపోయి చివరకు అహంకారం నశిస్తుంది. దీపం యొక్క మంట ఏవిధంగా పైవైపునకు మండుతూ ఉంటుందో అలాగే ఉన్న ఆలోచనల వైపు మనల్ని నిడిపించే జ్ఞానాన్ని సంపాదించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News