Wednesday, January 22, 2025

దీపావళి పండుగ ఏ రోజున?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దీపావళి అక్టోబర్ 31న లేక నవంబర్ 1న అనే సందిగ్ధతను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి దీపావళి అక్టోబర్ 31నే జరుపుకోవాల్సి ఉంది. లక్ష్మీపూజకు ఈ రోజునే శుభ ఘడియలు ఉన్నాయి.

అక్టోబర్ 31న సాయంత్రం 6.54 గంటల నుంచి రాత్రి 8.33 వరకు అంటే 1గంట 39 నిమిషాలు శుభ సమయంగా భావిస్తున్నారు. ఈ సమయంలో పూజకు దివ్యశక్తి తోడవుతుందని భావిస్తున్నారు. సాయంత్రం 6.02 నుంచి రాత్రి  8.33 వరకు ప్రదోష కాలం…దీపాలు వెలిగించడం, పూజ నిర్వహించడానికి ఉత్తమ సమయం. ఇక లక్ష్మీపూజకు అనుకూల సమయం సాయంత్రం 6.54 నుంచి రాత్రి 8.54 వరకు. ఈ సమయంను వృషభ కాలం అంటున్నారు.

Deepavali

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News