Friday, December 20, 2024

సారా టెండూల్కర్ పై డీప్ ఫేక్ దాడి..

- Advertisement -
- Advertisement -

ముంబై: సామాజిక మాధ్యమంలో తలెత్తిన అపశృతి డీప్ ఫేక్‌కు ఇప్పుడు సారా టెండూల్కర్ కూడా గురయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు అయిన సారా ఎక్కువగా సోషల్ మీడియాతో చురుగ్గా ఉంటారు. ఇటీవలి వరల్డ్ కప్ పోటీల దశల్లో ఆమె ట్వీట్లు అందరికీ ఉత్సాహాన్ని కల్గించాయి. అయితే ఇటీవలే తన తప్పుడు ఫోటోలతో డీప్‌ఫేక్ ఉదంతం చోటుచేసుకుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. డీప్ ఫేక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ షేక్ చేస్తోందని , దీని వల్ల అంతా సరైన రీతిలో విశ్లేషించుకునే వేదిక పట్ల అపనమ్మకం పెరుగుతోందని , దీనితో అందరి భావోద్వేగాల స్పందనకు విఘాతం ఏర్పడుతుందని ఆమె తెలిపారు. టెక్నాలజీని దుబారా చేయడం వల్ల చివరికి ఇంటర్నెట్ విశ్వసనీయత దెబ్బతింటుందని స్పందించారు. సెలబ్రీటిగా మారిన సారా త్వరలోనే బాలీవుడ్ నటిగా కూడా రాణించనుంది. రామ్‌చరణ్ హీరోగా వచ్చే ఓ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News