Wednesday, January 15, 2025

దీపిక కుమారి పరాజయం

- Advertisement -
- Advertisement -

పారిస్: మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక ఓటమి పాలైంది. దక్షిణ కొరియా ఆర్చర్ నామ్ సుహ్యెన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో దీపిక 46 తేడాతో పరాజయం చవిచూసింది. తొలి సెట్‌లో దీపిక మెరుగైన ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకుంటూ నిలబడింది. ఇదే క్రమంలో 2826 తేడాతో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మొదటి బాణం విసిరి ఏకంగా పది పాయింట్లు సాధించింది. కానీ ఆ తర్వాత గురి తప్పి ఆరు పాయింట్లే దక్కించుకుంది. దీంతో సెట్‌ను కోల్పోయింది. కానీ మూడో సెట్‌లో మళ్లీ పుంజుకుంది.

అద్భుత ప్రదర్శనతో అలరించిన దీపిక 2928తో సెట్‌ను దక్కింది. ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇదే సమయంలో దీపిక వరుసగా రెండు సెట్లను కోల్పోయింది. ఇక కీలక సమయంలో రెండు సెట్లను గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ప్రత్యర్థి నామ్ అసాధారణ ఆటతో మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరోవైపు భజర్ కౌర్ పోరాటం కూడా ముగిసింది. భజన్ కౌర్ శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. ఇండోనేసియా ఆర్చర్ చోరునిసాతో జరిగిన పోరులో భజన్ చివరి వరకు పోరాడి ఓడింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో చోరునిసా 65 తేడాతో భజన్ కౌర్‌పై వజియం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News