- Advertisement -
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్, దీపిక పదుకునేలది సూపర్ హిట్ జంట. షారుక్ ఖాన్ సరసన ఓం శాంతి ఓంలో నటించి పాపులర్ అయింది దీపిక. ఆ తర్వాత చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, జవాన్, పఠాన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిం ది ఈ స్టార్ బ్యూటీ. అందుకే ఇప్పుడు షారుక్ అడగగానే ఆయన కొత్త చిత్రంలో అతిథి పాత్ర పోషించేందుకు ఓకె చెప్పింది దీపిక. షారుక్ ఖాన్ హీరోగా, ఆయన కూతురు సుహానా మరో ప్రధాన పాత్రలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక సినిమా తీస్తున్నాడు. కింగ్ అనే పేరుతో తండ్రి కూతుళ్లతో యాక్షన్ చిత్రం తీస్తున్న ఈ దర్శకుడు ఒక కీలక పా త్ర కోసం దీపికని ఒప్పించాడు. సిద్ధార్థ్ ఆనంద్ తీసిన మూడు చిత్రాల్లో ఆమె నటించింది. పైగా షారుక్ మూవీ. దాంతో షారుక్ కూతురు సుహానాకి తల్లిగా నటించేందుకు ఆమె అంగీకరించింది. ఇక నిజజీవితంలో ఇటీవలే ఆమె తల్లి అయింది.
- Advertisement -