Friday, December 20, 2024

‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొణె లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటోంది. దీపికా పదుకొణె కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ల్లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్.

తాజాగా దీపికా పదుకొణె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. విజయవంతంగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అశ్విని దత్ నిర్మాణంలో ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News