Wednesday, January 22, 2025

ఆమె ఆమెనే…ఈమె ఈమెనే !

- Advertisement -
- Advertisement -
దీపిక పదుకొణెకు,  మోడల్ కామిలా అల్వెస్ కు మధ్య  ఉన్న తేడా నెటిజన్లకు తెలియదా?

న్యూఢిల్లీ: భారత సినీరంగం ఆస్కార్‌లో రెండు బహుమతులు గెలుచుకోవడం అందరికీ ఆనందకరంగా ఉంది. కాగా దీపికా పదుకొణె ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు అంతర్జాతీయ ఏజెన్సీలు దీపికను,  బ్రెజిలియన్ మోడల్ కామిలా అల్వెస్‌ అని భ్రమపడ్డాయి.  అల్వెస్ హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్‌కోనాగీని వివాహం చేసుకుంది. కొందరు నెటిజన్లయితే దీపికను అల్వెస్ అనే అనుకుంటున్నారు. దానిని మరికొందరు నెటిజన్లు ఖండించారు. దీపిక పదుకొణె 95 అకాడమీ అవార్డుల స్టేజ్ మీద హుందాగా, చిరునవ్వుతో ‘నాటు నాటు’ పాటను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రేక్షకులను గమనిస్తూ మధ్య మధ్యలో క్షణం ఆగి, ఆమె ఇంగ్లీషులో మాట్లాడిన తీరు అందరిని కట్టిపడేసింది. ఆమె నాటు నాటు పాటను ‘బ్యాంగర్’ అని కూడా పేర్కొంది. ఆ తర్వాత ఆ పాట నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాట ముగిసాక ప్రేక్షకులు గౌరవంగా లేచి నిలబడ్డారు(స్టాండింగ్ ఓవేషన్).

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News