- Advertisement -
రణవీర్‌ను అడిగిన నెటిజన్లు
న్యూఢిల్లీ: నటుడు రణవీర్‌సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏమైనా అడగండి…’అంటూ తన సెషన్‌లో ఫాలోయర్లను అడిగాడు. దీపిక పదుకోణె కూడా ఆ సెషన్‌లో జోడయ్యారు. “చల్, నన్ను ఏమైనా అడుగు” అని దీపిక కోరగా, రణ్‌వీర్ “ ఎప్పుడు ఇంటికి వస్తున్నావు?” అని అడిగాడు. “అన్నం వేడి చేసుకో బేబీ, నేను వచ్చేస్తున్నాను” అంటూ ఓ కిస్ ఎమోజీని కూడా పోస్ట్‌చేసింది. ఈ ఛాట్ సందర్భంగా ఓ ఫాలోయర్ “దీపిక పదుకోణె గురించి ఒక్క పదంలో వివరించండి” అని కోరాడు. అప్పుడు రణ్‌వీర్ “మహారాణి”అని జవాబిస్తూనే, మనం పైకి చెప్పకపోయినా మనస్సులో అంగీకరిస్తాం అని చమక్కు విసిరాడు.
- Advertisement -