Saturday, March 22, 2025

అది ఛాలెంజింగ్‌గా ఉంటుంది:దీపికా పదుకునే

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గత ఏడాది ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దీపికా ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు దీపికా తిరిగి సినిమా షూటింగుల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే మాట్లాడుతూ “ఇంత చిన్న వయసులో కూతురిని వదిలి సినిమా షూటింగ్‌లలో బిజీ అవడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నానని, ఎలాగైనా దీన్ని ఎదుర్కొంటాననే నమ్మకం నాకుంది.

అయితే ఈ ప్రభావం సినిమాలపై కూడా ఉంటుంది. నేను బిడ్డకు జన్మనివ్వక ముందు కూడా కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటాను”అని పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సింగం అగైన్ మూవీలో చివరిగా కనిపించిన దీపిక ఆ సినిమాలో చాలా పవర్‌ఫుల్ రోల్ లో కనిపించింది. దాంతో పాటు కల్కి 2898 ఏడీలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం కల్కి సీక్వెల్ కు సంబంధించిన పనులు జరుగుతుండగా, కల్కి 2 సినిమాలో దీపిక పాత్ర చాలా కీలకం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News