బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణే ‘పరీక్షా పే చర్చ’ కా ర్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె విద్యార్థులతో తన స్కూలు జీవితాన్ని పంచుకున్నారు. అంతేకాక ఆమె ‘మెంటల్ హెల్త్’కు సంబంధించిన విషయాలను వారితో పంచుకున్నారు. చిన్నప్పుడు తాను చాలా అల్లరి పిల్లనని పేర్కొన్నారు. ఒ క సోఫా మీది నుంచి మరొక సోఫా మీదకు గెంతుతుండే దానిని తెలిపారు.అప్పుడప్పుడు చాలా టెన్షన్‌కు గురయ్యేదానినని అన్నారు. తాను గణితంలో చాలా వీక్ అని పేర్కొన్నారు. నేటికీ తాను గణితంలో వీక్ అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన పుస్తకం ‘ఎగ్జామ్ వారియర్స్’(2018)లో రాసిన ‘అణచివేతను వ్యక్తీకరించండి’ (ఎక్స్‌ప్రెషన్ ఓవర్ సప్రెషన్)ను దీపికా పదుకొణే మె చ్చుకున్నారు.‘కనుక మీరు ఎల్లప్పుడూ మీ స్నేహితులు,
కుటుంబం, తల్లిదండ్రులు, టీచర్లతో మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోండి’ అని దీపి కా తెలిపారు. ‘ఈ అవకాశాన్ని, వేదికను కల్పించిన ప్రధానికి నా కృతజ్ఞతలు. మీరు ఎగ్జామ్ వారియర్స్‌గా మారండి, వర్రీయర్స్‌గా కాదు. మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అంతేకాదు కావల్సిన విశ్రాంతి కూడా తీసుకోమని కోరుతున్నాను’ అని దీపికా తన భావా లు పంచుకున్నారు. ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీ ఆమె అభిప్రాయాలను ప్రశంసించారు. అంతేకాదు తన విద్యార్థి జీవితాన్ని చర్చిస్తున్న దీపికా పదుకొణే క్లిప్‌ను కూడా ప్రధాని తన అధికారిక ‘ఎక్స్’ పేజీలో షేర్ చేశారు. కాగా దీపికా పదుకొణే కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని మోడీని మెచ్చుకున్నారు. “పరీక్ష పే చర్చ’ తాజా ఎపిసోడ్ నేడు(ఫిబ్రవరి 12న) ప్రసారం కాబోతున్నది.