Sunday, January 19, 2025

రాష్ట్ర సంగీత, నాటక అకాడమి చైర్‌సర్సన్‌గా దీపికా రెడ్డి

- Advertisement -
- Advertisement -

Deepika Reddy as Chairperson of State Music and Drama Academy

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత దీపికా రెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమి చైర్‌పర్సన్‌గా ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రెండేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు. దీపికా రెడ్డి నేషనల్ సంగీత నాటక అకాడమి అవార్డును 2017లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2016లో తెలంగాణ స్టేట్ అవార్డును ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. అమె డజను పైగా అవార్డులు అందుకోవడోం గమనార్హం. 1965, సెప్టెంబర్ 15న జన్మించిన దీపికా రెడ్డి నాటక రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె కుచిపూడి నాట్యకారిణిగా, కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News