Saturday, November 23, 2024

3 స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించిన దీపికకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

Deepika world no 1 in Archery Rankings 2021

పారిస్: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్3 ఆర్చరీ పోటీల్లో ఏకంగా మూడు స్వర్ణ పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది. వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్ విభాగాల్లో పసిడి పతకాలు గెలుచుకున్న దీపిక తాజా ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. 2012లోనూ దీపిక ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను సాధించింది. సోమవారం అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో దీపిక మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సాధించిన దీపిక పారిస్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతో అలరించింది. ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ఇదిలావుండగా ఈ ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభను కనబరిచారు. రికార్డు స్థాయిలో 9 స్వర్ణాలు, 12 రజతాలు, మరో ఏడు కాంస్య పతకాలు సాధించి పెను సంచలనం సృష్టించారు.

Deepika world no 1 in Archery Rankings 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News