Monday, December 23, 2024

ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ క్రికెటర్లుగా దీప్తి, కమిన్స్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డులను ఈసారి ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్)లు అందుకున్నారు. డిసెంబర్ నెలకు సంబంధింని ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును పురుషుల విభాగంలో కమిన్స్, మహిళల విభాగంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అందుకున్నారు. ఇటు కమిన్స్ అటు దీప్తి శర్మలు కిందటి నెలలో అసాధారణ ఆటతో ఆకట్టుకున్నారు.

పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కమిన్స్ అద్భుతంగా రాణించాడు. ఒకవైపు సారథిగా మరోవైపు బౌలర్‌గా జట్టుకు సిరీస్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు దీప్తి శర్మ కూడా చారిత్రక ప్రదర్శనతో అలరించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో ఇటు బంతితో అటు బ్యాట్‌తో అదరగొట్టింది. ఇరు జట్లపై భారత్ తొలిసారి టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో దీప్తికి కూడా ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News