Monday, December 23, 2024

వీధి కుక్కల దాడి…. జింక మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పిఎంసి పరిధిలోని జటాయువు ఫారెస్ట్ లో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వాతపూర్ సమీపంలో జటాయువు పార్కులో సంచరిస్తున్న ఓ జింక పిల్లపై వీధికుక్కల దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జింక మృతి చెందింది. అసలు వీధి కుక్కలు జటాయువు ఫారెస్ట్ లోకి ప్రవేశించడం వెనుక ఫారెస్ట్ అధికారుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. సాయిప్రియా కాలనీ కొన్ని సంవత్సరాలుగా ప్రహారి నిర్మాణ మరమ్మత్తులు చేపట్టకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదిలా ఉండగా కుందేళ్ళ వేటగాళ్ళు ఆ మార్గం ద్వారా జటాయువు లోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో కూడ వేటగాళ్ళు అక్కడ వేసిన వలలను వాకర్స్ తొలగించి ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది… తాజాగా జింక పిల్ల ను వీధి కుక్కలు దాడి చేసి చంపడం పట్ల వాకర్స్, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటూ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు వీధి కుక్కలను నివారించడంలో విఫలం కావడం పై అధికార యత్రాంగంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జింక మృతికి కారణమయిన ఫారెస్ట్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News