Saturday, December 21, 2024

రాహుల్ గాంధీపై పరువునష్టం దావా!

- Advertisement -
- Advertisement -
విచారణ ఏప్రిల్ 1కి వాయిదా

ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును మహారాష్ట్రలోని భీవాండిలో ఉన్న కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా శాశ్వతంగా మినహాయింపునివ్వాలని కూడా ఆయన కోర్టుకు విన్నవించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎల్. సి.వాడికర్ ముందు రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది నారాయణ్ అయ్యర్ మినహాయింపు దరఖాస్తు కూడా దాఖలు చేశారు.

రాహుల్ గాంధీ మీద కేసును దాఖలు చేసింది ఆర్‌ఎస్‌ఎస్ స్థానిక కార్యకర్త రాజేశ్ కుంతే. థానేకు చెందిన భీవండిలో 2014లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ ఉందని ఆరోపించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ తాను ఢిల్లీ వాసినని, లోక్‌సభ సభ్యుడినని, అయితే తాను హాజరు కావలసి వచ్చినప్పుడు తన న్యాయవాది విచారణకు వచ్చేలా అనుమతించాలని కోరారు. ఇదిలావుండగా ఫిర్యాదీ తరఫు న్యాయవాది నందు ఫాడ్కే తాము విచారణకు సిద్ధమేనని శనివారం కోర్టుకు తెలిపారు. ఆ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 1న జరుగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News