Saturday, September 28, 2024

రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

సుల్తాన్‌పూర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరవునష్టం కేసులో న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా విచారణను జూన్ 26వ తేదీకి వాయిదా పడింది. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై ఇక్కడి ఎంపి/ఎమ్మెల్యే కోర్టులో పరువునష్టం కేసు దాఖలైంది. బిజెపి నాయకుడు విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.

మంగళవారం ఈ కేసు విచారణ జరగవలసి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా విచారణ జూన్ 26వ తేదీకి వాయిదాపడినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోష్ కుమార్ పాండే తెలిపారు. సంబంధిత కోర్టు న్యాయమూర్తి శుభం వర్మ జూన్ 7న ఈ కేసు విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకాగా ఆయనకు జామీను మంజూరైంది. బెంగళూరులో ఒక విలేకరుల సమావేశంలో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై 2018 ఆగస్టు 4న కేసు నమోదైంది.

తాము నిజాయితీపరులమని, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకునే బిజెపికి హద్య కేసులో నిందితుడు అధ్యక్షుడని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినపుడు బిజెపి అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నాలుగేళ్ల ముందే 2005లో గుజరాత్‌లో అమిత్ షా హోం మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను నిర్దోషిగా ప్రకటిస్తూ ముంబైలోని కోర్టు తీర్పు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News