Wednesday, January 22, 2025

మాజీ సిజెఐ గొగోయ్‌పై పరువు నష్టం దావా

- Advertisement -
- Advertisement -

గౌహతి: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్‌పై అస్సాం పబ్లిక్ వర్క్ అధ్యక్షుడు ఆభిజీత్ శర్మ కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేయడంతో పాటు గొగోయ్ ఆత్మకథపై నిఫేధం విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ‘జస్టిస్ ఫర్ ఎ జడ్జి’ పేరుతో గొగోయ్ రాసిన ఆత్మకథలో తనను అప్రతిష్ఠపాలు చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ గొగోయ్‌పైన, ఆ పుస్తకాన్ని ప్రచురించిన రూపా పబ్లికేషన్‌సపైనా శర్మ పరువునష్టం దావా వేశారు.

ఈ పుస్తకాన్ని ప్రచురించకుండా, పంపిణీ చేయడం లేదా విక్రయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కూడా శర్మ తన పిటిషన్‌లో కోరారు. గౌహతిలోని కామరూప్ మెట్రోస్ జిల్లా కోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. గత మంగళవారం ఈ పిటిషన్లను విచారించిన కోర్టు న్యాయపరంగా, వాస్తవంగా విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్‌కు, ప్రతివాదులకు సమన్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News