న్యూఢిల్లీ : క్రిమినల్ పరువు నష్టం కేసులో ఢిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కు ఊరట లభించింది. ఆప్‌సీనియర్ నేత , మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ అంశాన్ని పరిగణన లోకి తీసుకునేందుకు నిరాకరించిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నేహా మిత్తల్ పిటిషన్‌ను కొట్టి వేశారు. ఓ టీవీ ఇంటర్వూలో బాన్సురీ స్వరాజ్ తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారని, ఆ ఇంటర్వూను లక్షలాది మంది చూశారని జైన్ ఫిర్యాదు చేశారు.
తన ఇంటి నుంచి రూ. 3 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు అధికారులు రికవరీ చేసుకున్నట్టుగా బాన్సురీ స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో తనను అవినీతి పరుడు, మోసగాడు అని ఆరోపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ … పరువు నష్టం ఫిర్యాదును కొట్టివేశారు.