వారు నిరాధార ఆరోపణలు చేశారన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి
న్యూఢిల్లీ : బుధవారం మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు నగదుకు వోట్లు కుంభకోణం ఆరోపణ ఎదుర్కొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్ తావ్డే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ఎంపి రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు శుక్రవారం పరువునష్టం నోటీసులు పంపారు.
‘రూ. 5 కోట్ల మేరకు నగదు పంచుతున్నట్లుగా వారు తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారు’ అని పేర్కొంటూ తావ్డే ఆ నోటీసులు పంపారు. ‘పార్టీ (బిజెపి) అవకాశాలు దెబ్బ తీయాలనే. సకారాత్మక ఆలోచనలు గల ప్రజల దృష్టిలో (నన్ను) అపఖ్యాతి పాల్జేయాలనే ఏకైక ఉద్దేశంతో’ ఆ ఆరోపణలు చేశారని తావ్డే ఫిర్యాదు చేశారు. ‘తాము సృష్టించిన& పూర్తిగా తప్పుడు కథనాన్ని ప్రచురిస్తున్నామనేది కాంగ్రెస్ నేతలకు పూర్తిగా తెలుసు’ అని తావ్డే తన లీగల్ నోటీస్‌లో పేర్కొన్నారు.