Wednesday, January 22, 2025

బిజెపికి ‘మును’గోడే!

- Advertisement -
- Advertisement -

ప్రలోభాల కోసం 200
కార్లు, 2వేల బైక్‌లు బుక్
చేశారు మావద్ద పక్కా
సమాచారం రాజగోపాల్
రెడ్డి స్వార్థం కోసమే
ఉప ఎన్నిక వచ్చింది మా
దగ్గర తాంత్రిక విద్యల్లేవు..
ఉన్నదంతా లోక్ తాంత్రికే
కేంద్ర మంత్రి నిర్మల, బండి
సంజయ్‌లది క్షుద్ర
రాజకీయం భూత వైద్యం
నేర్పించే దిక్కుమాలిన
చరిత్ర బిజెపిదే యూపీలో
అందుకోసం ప్రత్యేక కోర్సు
వందే భారత్ రైలుకు
బర్రెలు అడ్డమొస్తేనే
ముక్కలైంది కేంద్రం
దిక్కుమాలిన పాలనకు ఇదే
నిదర్శనం మునుగోడు
ఎన్నిక ధన అహంకారానికి,
ప్రజల ఆత్మగౌరవానికి మధ్య
పోరు బిజెపికి ఓటేస్తే
మోటార్లకు మీటర్లు
ఖాయం: మంత్రి హరీశ్

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ వద్ద ఎలాంటి తాంత్రిక విద్యలు లేవని.. తా లోక్‌తాంత్రిక్ విద్యయే అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూత వైద్యం నేర్పించే దిక్కుమాలిన చరిత్ర బిజెపిదేనని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీని కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కోర్సును ప్రవేశపెట్టిందన్నారు. అందులో చేరి బండి సంజయ్ నేర్చుకుంటే బాగుంటుందని చేశా రు. దేశ ప్రజల కోసం బిజెపి ఒక్క మంచి పనైనా చేసిందా? అని ప్రశ్నించారు. క్షుద్ర పూజలు, క్షుద్ర రాజకీయాలు చేయడంలో బిజెపిదే అగ్రస్థానమని విమర్శించారు. టిఆర్‌ఎస్ పార్టీది ఉద్యమ చరిత్ర అయితే.. రక్త చరిత్ర అ ని విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయం లో శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎంఎస్. ప్రభాకర్‌రావు, ఎంఎల్‌సి వి. గంగాధర్ గౌడ్, ఎంఎల్‌ఎ ముఠాగోపాల్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి పెద్దఎత్తున దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్ర స్థాయిలో యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగం గా 200 కార్లు, 2వేల బైకులు బుక్ చేసినట్లు తమ వద్ద స మగ్ర సమాచారం ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పకుండా బిజెపి నేతలు పచ్చి అబద్ధాలు.. త్య ప్రచారం చేస్తూ లబ్ధి చూస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ ఉపఎన్నికల్లో బిజెపి కోట్లు కుమ్మరించినా బిజెపికి ఓటమి తప్పదన్నారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ము నుగోడు ప్రజలు మరువరన్నారు. ఉపఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మోటార్లు కావాలో, మీటర్లు కావాలో తేల్చుకోవాలని సూచించారు. మునుగోడు ఉపఎన్నిక రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యక్తిగత స్వార్థ రాజకీయం కోసం వచ్చిందన్నారు. ఈ ఉపఎన్నికను తెచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

దివాలా కోరు, ప్రభుత్వం బిజెపిదే

బిజెపిది దివాలా కోరు, ప్రభుత్వమని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మోడీకి పాలన చేతకాకే ప్రభుత్వ రంగ సంస్థలను వరుసపెట్టి అమ్ముతున్నారన్నారు. ఈ పుణమంతా మోడీ అసమర్ధ ప్రభుత్వానిదేనని విమర్శించారు. చివరకు సైనికులను కూడా విడిచిపెట్టకుండా వారి ఉసురును బిజెపి తీస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుతవం చేనేత కార్మికులకు ఇచ్చిన పథకాలను కూడా కేంద్రం తొలగించిందన్నారు. దేశంలో ఓ ఒక్క వర్గం వారికైనా బిజె పి పాలనలో మేలు జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న కేంద్రం.. ఉన్న గ్యా స్ సిలిండర్‌ను రూ.1,200కు పెంచిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ అసమర్థ పాలన కారణంగానే రూపాయి వి లువ దిగజారిందని విమర్శించారు. కేంద్ర మం త్రులే రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొగిడారన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథను ఎక్కువుగా పొగిడింది బిజెపి నా యకులు కాదా? హరీశ్‌రావు ప్రశ్నించారు.

సీతారామన్‌వి చౌకబారు రాజకీయాలు

కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ చౌకబారు మా టలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్ర తంత్రాలతో తామేమైనా అధికారంలోకి వచ్చామా? అని ప్రశ్నించారు. మతం పేరుతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయం చేసేది బిజెపియేనని అన్నా రు. అందుకే భూత వైద్యం కోర్సు నేర్చుకోవాలని యూపీలోని బెనారస్‌లో కేంద్రం కొత్త కోర్సును తీసుకొచ్చిందన్నా రు. ఉద్యోగాల భర్తీ గురించి బిజెపి నేతలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుందన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలపై తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని…. మరి కేంద్రం కల్పించిన ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం సీతారామాన్‌కు ఉందా? ప్రశ్నించారు.

సీతారామన్ మాటలు చూస్తుంటే ఉట్టికి ఎగురనమ్మా స్వర్గానికి ఎగిరినట్టుంది అని బిఆర్‌ఎస్ ఆమె సీతారామన్ వ్యం గ్యంగా మాట్లాడం శోచనీయమని అన్నారు. గతంలో తెలంగాణ సాధించి తాము ఉట్టికి ఎగిరామన్నారు. ఇపుడు దేశ వ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలు చేసేందుకు బిఆర్‌ను ప్రవేశపెట్టామన్నారు. కేంద్ర పాలన ఎట్టున్నది అంటే…… వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్‌కు బర్రెలు అడ్డం వస్తే ముక్కలు అయ్యిందన ఎద్దేవా చేశారు. బిజెపి చెప్పేవి నీతులు… తవ్వేది గోతులని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బిజెపి మునుగోడులో చేసే అరాచకాలపై నిఘా పెట్టి త్వరలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇది ఆత్మగౌరవ ఎన్నిక

మునుగోడు ఎన్నికల ప్రజల ఆత్మగౌరవానికి పరీక్ష అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్ పనుల కోసం ఆయన బిజెపికి అమ్ముడుపోయారని విమర్శించారు. అందుకే రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అహంకార ధనానికి, నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరుగా హరీశ్‌రావు అభివర్ణించారు. ఉమ్మజి నల్లగొండ జిల్లాలో దశాబ్ధాల పాటు నెలకొని ఉన్న ఫ్లోరెడ్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పరిష్కరించిందన్నారు. పేదింటి ఆడపిల్ల కల్యాణం కోసం లక్ష రూపాయలను ఇస్తున్న ప్రభుత్వం దేశంలో టిఆర్‌ఎస్ ఒక్కటేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఇటీవల కేంద్రం నుంచి అందుకున్న అవార్డులే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News