Monday, December 23, 2024

రెండో వన్డేలో భారత మహిళల ఓటమి

- Advertisement -
- Advertisement -

Defeat of Indian women in the second ODI

 

క్వీన్స్‌టౌన్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ మూడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్లు మేఘన (49), షఫాలీ వర్మ (31) శుభారంభం అందించారు. యస్తిక భాటియా (31), కెప్టెన్ మిథాలీ రాజ్ 66 (నాటౌట్) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ధాటిగా ఆడిన వికెట్ కీపర్ రిచా ఘోష్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు చేసింది. దీంతో భారత్ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరగులు చేసి విజయాన్ని అందుకుంది. అమెలియా కేర్ 119 (నాటౌట్) అజేయ శకతంతో జట్టును గెలిపించింది. మాడీ గ్రీన్ (52) తనవంతు పాత్ర పోషించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News