Sunday, September 8, 2024

ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది

- Advertisement -
- Advertisement -

Defeat TeamIndia in Tests on their own turf:warner

డేవిడ్ వార్నర్

మెల్‌బోర్న్: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే లోపు టెస్టుల్లో టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించాలన్నదే తన చిరకాల వాంఛ అని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు చవి చూశానని, అయితే ఒక కోరిక మాత్రం ఇప్పటికీ అలాగే మిగిలి పోయిందన్నాడు. ఆటకు వీడ్కోలు పలికే లోపు భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాల్నదే తన కోరిక అని స్పష్టం చేశాడు. తన కోరిక నెరవేరుతుందనే నమ్మకం ఉందన్నాడు. అయితే టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం ఎంత పెద్ద జట్టుకైనా చాలా కష్టమైన అంశమని తనకు తెలుసన్నాడు. అయితే కెరీర్ ముగిసే లోగా ఈ కోరిక తీర్చుకుంటాననే నమ్మకం తనకుందని వార్నర్ పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News