Wednesday, January 22, 2025

టిఆర్‌ఎస్‌ను గెలిపించి కెసిఆర్ పాలనకు మద్దతుగా నిలవండి

- Advertisement -
- Advertisement -
  • మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్

గూడూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయంలోని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని సంక్షేమ పథకాలకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కెసిఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి భానోతు శంకర్ నాయక్ కోరారు.

మంగళవారం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి గూడూరు మండలంలో ప్రచారం ప్రారంభించారు. ముందుగా చిన్న ఎల్లాపూర్ భూపతి పేట సీతానగరం వెంగంపేట కోబాల్ తండా మర్రిమిట్ట లైన్ తండా గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటానని మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ మీ వెంటే ఉంటున్నానని మీరంతా కలిసికట్టుగా పనిచేయాలని తన గెలుపు కోసం ఈ నెల రోజులపాటు కష్టపడితే వచ్చే ఐదేళ్లు తను కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తానని గ్రామాల అభివృద్ధి చేసింది.

మనమేనని గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవ్వాలా గ్రామాలు అన్ని మౌలిక వసతులు సంతరించుకున్నాయని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి ప్రజల వద్దకు పరిపాలన తీసుకువచ్చామని ఆయన అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోర్టును అభ్యర్థించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలోనే గూడూరు అభివృద్ధి చెందిందని గ్రామాలకు మౌలిక వసతులు కల్పించామని ఆయన అన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో ఓటు వేసి ఆశీర్వదించాలని తర్వాత మీ అందరికీ అండగా నిలబడి ప్రజలందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, ఎండి కాసిం, వెంకట కృష్ణారెడ్డి, నూకల సురేందర్, ఆయా గ్రామాల గ్రామ అధ్యక్షులు సర్పంచులు,ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News