Sunday, December 22, 2024

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో షాక్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హతపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్‌ చేయగా… తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్ట్‌ డివిజన్‌ బెంచ్‌ స్పస్టం చేసింది.

ఈనెల 24న వాదనలు వింటామని చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన సంగతిత తెలిసిందే. షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును గతంలో బీఆర్‌ఎస్ ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News