న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్‌లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు. ఇంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 5.94 లక్షల కోట్లుగా ఉంది. ప్రత్యేకించి రక్షణ రంగంలో కీలకమైన రీతిలో ప్రగాఢ శక్తివంతమైన సాంకేతికను ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి వివరించారు. ఇక ఆయుధ సంపత్తి , రక్షణ పాటవాన్ని పెంచుకునే దిశలో మూలధన పెట్టుబడిగా రూ 1.72 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఏర్పాటు ద్వారా నూతన ఆయుధాల కొనుగోళ్లు, యుద్ధ విమానాలు, యుద్ధనౌకల ఇతర సైనిక విడిభాగాల సేకరణకు వీలేర్పడుతుంది. ప్రత్యేకించి దేశంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దేశీయ తయారీ ఆత్మనిర్భరతను మరింత వేగిరపర్చేందుకు ప్రాధాన్యత ఇస్తారు.
సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అధునాతనం, అరివీర భయంకరం అయ్యేందుకు సరికొత్త పథకం ఖరారు చేస్తారు. ఇక రక్షణ రంగంలో మొత్తం నికర వ్యయం రూ 4,39,300 కోట్లు. ఇందులో డిఫెన్స్ పెన్షన్లకు రూ 1,41,205 కోట్లను, , రూ 2,82,772 కోట్లను సిబ్బంది సేవలకు, రూ 15,322 కోట్లను రక్షణ మంత్రిత్వశాఖ సివిల్ పనులకు కేటాయించారు.నౌకాదళానికి రూ 23,800 కోట్లు. నౌకాదళ డాక్‌యార్డ్‌ల ప్రాజెక్టులకు రూ 6830 కోట్లు ఇతర పరికరాలకు విడిగా ఖర్చుపెడుతారు. డిఫెన్స్ సర్వీసెస్ క్యాపిటల్ పెట్టుబడిలో నుంచి రూ 40,777 కోట్లను ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎరో ఇంజిన్ల సమీకరణ జరుగుతుంది.భారతీయ వైమానిక దళానికి పెట్టుబడి కోటాగా అత్యధికంగా రూ 57,137.09 కోట్లు, ఇందులో విమానాలు, ఏరో ఇంజిన్ల సేకరణకు రూ 15,721 కోట్లు. ఇతర పరికరాలు కోసం రూ 62,343 కోట్లు .
దేశీయ అంతర్గత భద్రతకు ప్రాధాన్యత
హోం మంత్రిత్వశాఖకు రూ 2 లక్షల కోట్లు
తాత్కాలిక బడ్జెట్‌లో ఈసారి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు రూ 202868.70 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక వాటాగా సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్ బలగాలైన పారామిలిటరీ దళాలకు చెందుతాయి. ఇందులోనే పోలీసు విభాగానికి రూ 132345.47 కోట్లు ప్రత్యేకించారు. ఇందులో 37277.74 కోట్లు కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్మూ కశ్మీర్‌కు అందుతుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత శాంతిభద్రతల పరిరక్షణల కోణంలో ఈ కేటాయింపు ఉంటుంది. లద్ధాక్ పారామిలిటరీ బలగాలకు రూ 5958 కోట్లు, అండమాన్, నికోబార్ దీవులకు రూ 5866.37 కోట్లు, చండీగడ్‌కు 5862.62 కోట్లు, పుదుచ్చేరికి రూ 3269 కోట్లు. దాద్రా నాగర్ హవేలీ, డియూ డామాలకు 2648.97 కోట్లు, లక్షద్వీప్‌నకు రూ 1490.10 కోట్లు. దేశరాజధాని ఢిల్లీకి రూ 1168.01 కోట్లు.
కేంద్ర మంత్రిమండలి సంబంధిత ఖర్చులు
రూ 1248.91 కోట్లు, ఇందులో మంత్రుల జీతభత్యాలు ఇతరాలు
మంత్రి మండలి సభ్యులు , కేబినెట్ సెక్రెటరీలు, ప్రధాన మంత్రి కార్యాలయం , ఆతిధ్యం, ఎంటర్‌టైన్మెంట్‌క సంబంధించి ఖర్చు మొత్తం రూ 1248.91 కోట్లు.ఇంటలిజెన్స్ బ్యూరోకు రై 3195.09 కోట్లు కేటాయించారు. పర్సనల్ మంత్రిత్వశాఖ అధికారులకు శిక్షణకు రూ 312 కోట్లు కేటాయించారు.
* దేశంలో అంత్యోదయ అన్న యోజన పథకం (ఎఎవై) పరిధిలోని 1.89 కోట్ల కుటుంబాలకు ఇస్తోన్న చక్కెర సబ్సిడీ పథకం మరో రెండేళ్ల పాటు అంటే 2026 మార్చి 31 వరకూ రేషన్‌కార్డుల ద్వారా కొనసాగుతుంది ఈవిషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్) ద్వారా ఈ సబ్సిడీ చక్కెర అందుతోంది. దీని మేరకు వినియోగదారులకు ఈ విధానం పరిధిలో కిలోకు రూ 18.50 పైసల చొప్పున చక్కెర విక్రయిస్తారు.
*విదేశాంగ మంత్రిత్వశాఖకు ఈ బడ్జెట్‌లో రూ 22,154 కోట్లు కేటాయించారు. ఇంతకు ముందు ఇది రూ 18,050 కోట్లుగా ఉంది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు కేటాయింపులు ఈసారి 12 శాతం మేర పెరిగాయి. ఈ మంత్రిత్వశాఖకు ఇంతకు ముందు రూ 1.57 లక్షల కోట్లు ఉండగా దీనిని ఇప్పుడు 1.77 లక్షల కోట్లకు పెంచారు.
ఉపాధి హామీ పథకానికి రూ 86000 కోట్లు
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ ఈ బడ్జెట్ రూ 86,000 కోట్లు కేటాయించారు. ఇంతకు ముందు ఇది రూ 60,000 కోట్లు , ఈ క్రమంలో గ్రామీణ పేదల ఉపాధి హామీ పథకానికి పెరిగింది 43 శాతం.