Tuesday, April 29, 2025

ప్రధానితో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం ప్రస్తుతం జమ్మూకశ్మీర్ క్రమంగా కోలుకుంటోంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధానిని కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న భద్రతా పరిస్థితిని పూర్తిగా వివరించారు. ఏప్రిల్ 22న 26 మందిని బలిగొన్న టెర్రరిస్ట్ ల దాడి వెనుకఉన్న కుట్రదారులను శిక్షించేందుకు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో ఈ బ్రీఫింగ్ జరిగింది. ఈ దాడికీ, సరిహద్దు ఆవలి దేశంతో గల సంబంధాలు కీలకం అని పేర్కొంటూ, భయంకరమైన టెర్రర్ దాడి పట్ల దేశంలోనూ,

విదేశాలలోనూ విసృ్తతంగా వ్యక్తమైన తీవ్ర ఆగ్రహం నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని భారత్ స్పష్టంచేసింది.ప్రధానితో రక్షణమంత్రి భేటీపై అధికార ప్రకటన ఏదీ వెలువడలేదు. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, కుట్రదారులకు గట్టిగా శిక్ష తప్పదని ప్రధాని మోదీ మన్ కా బాత్ కార్యక్రమంలో స్పష్టంచేశారు. టెర్రరిస్ట్ లపై పోరులో మొత్తం ప్రపంచం 140 కోట్ల భారతీయులకు అండగా నిలుస్తోందని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News