శ్రీనగర్ : భారత్ వేయిగాట్లతో నెత్తురోడాలనే విధంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. పలు విధాలుగా పొరుగు దేశం అయిన భారత్‌ను దెబ్బతీయాలనేదే పాకిస్థాన్ సంకల్పం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాకిస్థాన్ దుశ్చర్యలు సహించేది లేదని, గట్టి జవాబు ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు. దేశ ఐక్యత సమగ్రతలను గాయపర్చే విధంగా వ్యవహరిస్తే పాకిస్థాన్‌కు చుక్కలు చూపుతామని హెచ్చరించారు. బారాముల్లా జిల్లాలో గురువారం రక్షణ మంత్రి భద్రతా బలగాలను ఉద్ధేశించి మాట్లాడారు. తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు దిగడం పాకిస్థాన్‌కు పరిపాటి అయింది. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద చర్యలతో తల్లడిల్లింది. తన వైఖరితో పాకిస్థాన్ ఎప్పుడూ భారత్ గాయపడేలా చేయాలని అనుకుంటూ వస్తోంది. అయితే ఇది దుస్సాహాసమే అవుతుంది. దీనికి తగు విధంగా గుణపాఠం చెప్పడం జరుగుతుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రెండు రోజుల పర్యటనకు వచ్చారు.
భారత్ నెత్తురోడాలనే పాక్‌తంతు.. సాగనిచ్చేది లేదు: రాజ్‌నాథ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -