Sunday, December 22, 2024

ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు రక్షణశాఖ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత రక్షణ శాఖ అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి తాజాగా ఆమోదం తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం లోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొనుగోలు ప్రక్రియకు ముందు ఈ డీల్ భద్రతకు సంబంధించిన క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఈ ప్రిడేటర్ డ్రోన్లను తయారు చేసింది. తాలిబన్, ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్లలో ఈ డ్రోన్లు అత్యంత సామర్ధం చూపించి విజయవంతమయ్యాయి.

అధిక ఎత్తులో ప్రయాణించే లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు స్ట్రైక్ క్షిపణులను ఇవి కలిగి ఉంటాయి. అలాగే అత్యంత కచ్చితత్వంతో శత్రువుల లక్షాలను ఇవి ఛేదించ గలుగుతాయి. దేశ సరిహద్దుల్లో సముద్ర ప్రాంతాల్లో సుదూర నిఘా కోసం వీటిని ఉపయోగించనున్నారు. భారత నౌకాదళం ఈ ఒప్పందానికి ప్రధాన ఏజెన్సీగా ఉంది. దీనిలో 15 డ్రోన్లు, వాటి బాధ్యత, నిఘా కార్యకలాపాల కోసం ఇండియన్ నేవీకే ఇవి కేటాయించబడతాయి. అయితే సైన్యం లోని మూడు విభాగాలకు సమానంగా ఈ డ్రోన్లను పంపిణీ చేసి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం వీటిని వినియోగించవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News