Wednesday, January 22, 2025

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Defendant arrested in rape case against girl

హైదరాబాద్: షేర్ చాట్‌లో పరిచయమైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… బాలికకు షేర్ చాట్‌లో యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు ఎనిమిది రోజులు ఛాటింగ్ చేసుకున్నారు. తర్వాత బాలిక ఇంట్లో నుంచి యువకుడితో వెళ్లిపోయింది. బాలికను ఓయో లాడ్జికి తీసుకుని వెళ్లి అందులో ఉంచాడు. అక్కడే యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి ఇంటికి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News