Monday, December 23, 2024

గృహహింస కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరో: భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసి హత్య చేసిన నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలం, ఇందుర్తి గ్రామానికి చెందిన కటకం కృష్ణమాచారి తన కూతురు రాగియాణి రాధికను దేవరకొండ, హనుమాన్ నగర్‌కు చెందిన రాగియాణి బ్రహ్మచారికి ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఈ దంపతులకు బాబు జన్మించాడు. ఈ క్రమంలోనే బ్రహ్మచారి మద్యానికి బానిసగామారాడు.

తరచూ రాధికపై దాడి చేస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా రాధికను హింసిస్తున్నాడు. మే 01, 2018న నిందితుడు రాధికపై దాడి చేయడంతో నుదిటిపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న ఎల్‌బి నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు పోలీసులు సాక్షాలు ప్రవేశపెట్టడంతో కోర్టు తుది తీర్పు చెప్పింది. ఎస్సై రవికుమార్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News