Saturday, November 2, 2024

బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు
తీర్పు చెప్పిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
Defendant sentenced to four years in prison

మనతెలంగాణ, సిటిబ్యూరో: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న నిందితుడికి నాలుగేళ్లజైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నగరంలోని సరూర్‌నగర్, లింగోజిగూడకు చెందిన ఆశమల్ల శ్రవణ్‌కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్నంటున్న బాలిక(13) ప్రేమిస్తున్నానని వేధించడం ప్రారంభించాడు. బాలిక పాఠశాలకు వెళ్తుండగా వెంబడించేవాడు. ఎన్నిసార్లు చెప్పిన బాలికను వెంబడించేవాడు. వేధింపులు భరించేలని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నిందితుడికి వార్నింగ్ ఇచ్చారు, ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 01వ తేదీ, 2015న బాలిక పాఠశాలకు వెళ్తుండగా బలవంతంగా కారు ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు.

కర్మాన్‌ఘాట్‌కు తీసుకుని వెళ్లి అక్కడ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక నిందితుడి ఫోన్ తీసుకుని ఫోన్ చేయడంతో భయపడిన నిందితుడు బాలికను కామేశ్వరరావు నగర్‌లో విచిపెట్టాడు. ఈ విషయం ఎవరికైన చెబితే మీ తల్లిదండ్రులను చంపివేస్తాని భయపెట్టడంతో ఎవరికీ చెప్పలేదు. తర్వాత బాలిక సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఐఓ విజయ్‌బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News