Friday, April 11, 2025

అధునాతన ఆయుధ సైనిక పాటవం

- Advertisement -
- Advertisement -

జమ్మూ : భారత సైనిక దళాలు అత్యంత అధునాతన ఆయుధాలను సంతరించుకుని ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. జాతీయ భద్రత తమ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతాంశం అన్నారు. దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమాధికార పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేశం ఆయుధాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధార పడ దల్చుకోలేదన్నారు.

మన సైనికావసరాలకు సరిపోయే అధునాతన ఆయుధాలను ఇక్కడనే రూపొందించుకోవడం జరుగుతోంది. భారత్‌లో తయారీ, ప్రపంచం కోసం కూడా అనేదే తమ నినాదం అని రాజ్‌నాథ్ ఇక్కడ సోమవారం జరిగిన జాతీయ భద్రతా సదస్సును ఉద్ధేశించి మాట్లాడుతూ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News