Thursday, January 23, 2025

రక్షణ త్రైపాక్షిక్ష సమావేశం

- Advertisement -
- Advertisement -

రామగిరి: ఆర్జీ 3 ఏరియా, ఏపీఏలోనీ సీఎన్‌సీఓఏ క్లబ్‌లో బుధవారం 18వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశాన్ని మైనింగ్ సెఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భూషణ్ ప్రసాద్ అధ్యక్షతన ఆయా శాఖల అధిపతులు నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి, గురవయ్య, సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గని ప్రమాదాలో మృతి చెందిన కార్మికులకు మౌనం పాటించి, రక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏరియా రక్షణ అధికారి వెంకట రమణ గత 17వ రక్షణ సమావేశ మినిట్స్‌పై, ఏరియాలో తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రాజంటేషన్ ద్వారా వివరించారు. యూనియన్ ప్రతినిధులు, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు, అన్ని గనుల ప్రాజెక్టు అధికారులు, మేనేజర్లు, రక్షణ అధికారులు రక్షణపై చర్చించారు.

ఈ సందర్భంగా డీప్యూటీ డీజీఎం భూషణ్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ గనుల్లో తీసుకుంటున్నరక్షణ చర్యలపై చర్చించి, గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని, ప్రమాద రహిత సింగరేణిగా ఉండాలని, రక్షణలో మైనింగ్ అధికారులు, సింగరేణి సంస్థ యాజమాన్యం, యూనియన్ నాయకులు మూడు పిల్లర్లలాగా కలిసి పని చేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు బెహెరా, అరుముగం, వెంకన్న, ప్రేమ్ కుమార్, దిలీప్ కుమార్, సాంబయ్య, టీబీజీకే ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్యతోపాటు పలు సంఘాల నాయకులు వైవీ రావు, మధునయ్య, కుమారస్వామి, కొమురయ్య, మామిడి స్వామి, అధికారులు నాగేశ్వర్‌రావు, ఎలీషా, సీతారామం, రఘుపతి, రాధాకృష్ణ, రాజేందర్, జనార్ధన్, కిరణ్ రాజ్, శ్రీనివాస్‌తోపాటు పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News