Monday, December 23, 2024

ఊరిస్తున్న మేఘాలు

- Advertisement -
- Advertisement -

సీజన్ మొదలైనా
అరకొర వర్షాలే

విత్తనాలు వేసి దిక్కులు చూస్తున్న రైతులు ఇప్పటివరకు
20%లోపే సాగు దక్షిణ తెలంగాణలో పరిస్థితి దారుణం

మన తెలంగాణ/హైదరాబాద్ : అవిగో రుతుపవనాలు.. వర్షాలు అంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఊరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు ఉస్సూరు మనిపిస్తున్నాయి. రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉండటంతో అవి రాష్ట్రమంతటికీ విస్తరించలేకపోతున్నాయి. ఈ పాటికి రాష్ట్రమంతటా జోరువానలు కురిసి పంటల సాగు జోరుమీద సాగాలి అయితే వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలించకపోవడం, కొన్ని జిల్లా ల్లో పొడివాతావరణం కారణంగా వ్యవసాయ పనులు అనుకున్నంతగా ముందుకు సాగటం లేదు. నైరుతి రుతుపనాల ప్రభావంతో రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు సాధారణ వర్షపాతం 720.4 వర్షపాతం నమోదు కావాల్సివుంది. జూన్‌నెలకు సంబధించి ఇప్పటికే 108మి.మీ నమోదు ఉత్తర తెలంగాణలోని కొన్ని జి ల్లాల్లోనే ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు లోటు వర్షాలతో బిక్కుబిక్కుమంటున్నాయి. గత నాలుగేళ్ల జూన్ వర్షపాత రికార్డులు పరిశీలిస్తే 2018లో 121మి.మీ కురవగా , 2019లో 69మి.మితోనే సరిపెట్టింది. 171 వర్షాలు ప్రారంభంలోనే దంచికొట్టాయి. గత ఏడాది వానాకాలంలో కూడా జూన్‌లో 194మి.మీతో 51శాతం అధికంగా వర్షపాతం రికార్డయింది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచే నైరుతి నిరాశగొలుపుతోంది. నెలాఖరు నాటికి సాధారణ వర్షపాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

మందకోడిగా పంటల సాగు

రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగు మందకోడిగా సాగుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలపు పంటలకింద అన్ని రకాల పంటలు కలిపి కోటి 42లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోం ది. అందులో అత్యధికంగా 70లక్షల ఎకరాల్లో పత్తి, 45లక్షల ఎకరాల్లో వరి, 20లక్షల ఎకరాల్లో కంది పంటల సా గుకు ప్రతిపాదనలు చేస్తోంది. మిగిలిన పంటల్లో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ, సోయా పంటలను ప్రతిపాదిస్తోంది. తొలకరి వర్షాలను నమ్ముకొని కొన్ని జిల్లాల్లో రైతులు పత్తి విత్తనాలు వేశారు. సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రోహిణి కార్తేలోనే పొలంలో పత్తి విత్తానాలు నాటుకున్నారు. మృగశిరలో కూడా పత్తి లు నాటారు. అయితే దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తగినంత వర్షపాతం లేకపోవడంతో పొలంలోనే పత్తి విత్తనాలు మొలకరాకుండా మొండికేస్తున్నాయి.

పొడిగాలుల తీవ్రతకు నేలలో పదను త్వరగా ఆవిరైతోంది. పొలంలో వే సిన విత్తనాలు తేమలేక, మొలక రాక నేలలోనే పొక్కిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2021వానాకాలంలో కోటి 16లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రతిపాదించారు. జూన్ 25నాటికి 25.34లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాల్సివుండగా , వాతావరణం అనుకూలించటంతో 34.36లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. సీజన్ ప్రాంరభమైన మూడు వారాల్లోనే అన్ని రకాల పంటలు 29.5శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఈ సారి ఆ పరిస్థితి కనిపించటంలేదు. ఉత్తర తెలంగాణలో పత్తిసాగు జోరుమీద సాగినా , దక్షిణ తెలంగాణలో మాత్రం పంటల సాగు వెనకుబడిపోయింది. వివిధ జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో వానాకాల పంటలు 20శాతంలోపే సాగులోకి వచ్చాయి.

బోర్లకింద జోరుగా వరినార్లు:

కృష్ణా, గోదావరి నదుల పరిశాహకంగా ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళిక ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. భూగర్భజలాలు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో రైతులు బోర్ల కింద జోరుగా వరినార్లు పోస్తున్నారు. కరీంనగర్ , నిజామాబాద్ తదితర జిల్లాల్లో రోహిణి కార్తేలోనే వరినార్లు పోసుకున్నారు. నార్లు పెరిగిన చోట వరినాట్లు కూడా ప్రారంభించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరోట్టు ఎరువుల ద్వార భూసారాన్ని పెంచేందుకు పొలాల్లో జీలుగ, జనుము , పిల్లిపెసర పైర్లు పెంచుతున్నారు.

పదును చూశాకే విత్తనం:

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసి నేల బాగా పదునెక్కిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. తేలికపాటి వర్షాలను నమ్ముకొని విలువైన విత్తనాలు పొలంలో నాటి వాటిని వృధాచేయరాదని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తొలకరి వర్షాలను నమ్ముకొని నాటుకొన్న విత్తానాలు వర్షాలు ముఖం చాటేయటంతో ఇప్పడు పొలంలోనే పొక్కిపోతున్నాయి. మరికోన్ని చోట్ల పొడిగాలికి లేతమొక్కలు వాడుపడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేలికపాటి నేలల్లో 50నుంచి60మి.మి, బరువు నేలల్లో 60నుంచి 70మి.మి వర్షపాతం నమోదైన తర్వాత లేదా నేలలో 15నుంచి20 సెంటీమిటర్లు లోతుకు తడిచిన తరువాతనే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తుంపర చినుకులను నమ్మి విత్తానాలు నాటుకుంటే నష్టపోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎంతో విలువైన విత్తానాలు వృధాచేసుకుంటే మళ్లీ దొరకటం కష్టమని, అంతే కాకుండా సాగు ఖర్చులతోపాటు సమయం కూడా వృధా అవుతాయంటున్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమణిస్తూ పూర్తి అనుకూలత ఉన్నప్పుడే విత్తనాల వేసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News