- Advertisement -
చెన్నై: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్-ధన లక్ష్మీ అనే దంపతులు సందవేలూరు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు మోహన్ ప్రియ (19) అనే కూతురు బిఎస్‌సి మొదటి సంవత్సరం చదువుతోంది. రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి అన్న సెల్వరాజ్ ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లుతున్నానని చెబుతూ ప్రియ వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన ప్రియ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆమెను 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. బంధువుతో పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు వాపోతున్నారు.
- Advertisement -