Wednesday, January 22, 2025

ఆర్మూర్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి చెందిన గోలి రక్షిత (21) అనే విద్యార్థిని ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో ఆదివారం రాత్రి భోజనం సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన వివరాల మేరకు మెండోరా మండల కేంద్రానికి చెందిన గోలి చిన్నయ్య సత్తెమ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసుత్తం తండ్రి చిన్నయ్య దుబాయ్‌లో ఉంటుండగా రెండో కూతురు రక్షిత ఆర్మూర్ లోని నరేంద్ర కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఎస్సీ హాస్టల్‌లో ఉంటోంది.

కాగా ఆమె ఆదివారం రాత్రి ఆకస్మికంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదని బంధువులు తెలిపారు. విద్యార్థిని రక్షిత తండ్రి బతుకు దెరువు కోసం దుబాయ్‌కి వెళ్లాడు. తన కూతురు మరణ సమాచారం తెలుసుకున్న ఆయన స్వగ్రామానికి విచ్చేవరకు అంత్యక్రియాలు చేయవద్దని కుటుంబ సభ్యులకు తెలపడంతో అంత్యక్రియలు మంగళవారం చేయడం జరుగుతుందని బంధువులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News