Monday, December 23, 2024

సంగారెడ్డిలో డిగ్రీ విద్యార్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

 

అమీన్పూర్: సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాకేశ్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. రాకేశ్ గీతం వర్సిటీలో బిఎస్‌సి తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 26న కాలేజీకి వెళ్లి రాకేశ్ ఇంటికి తిరిగిరాలేదు. రాకేశ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో రాకేశ్ తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేజ్ చేస్తున్నారు.

Also Read: విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News