న్యూఢిల్లీ: పక్కింట్లో ఉండే బాలుడు మరో బాలుడి చంపేసి మొండెం, తలను వేరు చేసిన సంఘటన ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో జరిగింది. మొండెం, తలను యుపిలోని మీరట్ లో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మనవ్ కుమార్ అనే బాలుడు తన తల్లి దండ్రులతో కలిసి ప్రిత్ విహార్ లో ఉంటున్నాడు. నవంబర్ 30న మనవ్ కుమార్, అతడి పక్కింట్లో ఉండే బాలుడు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పక్కింట్లో ఉండే బాలుడు చంపినట్టు విచారణలో గుర్తించారు. ప్రిత్ కుమార్ పక్కింట్లో ఉండే బాలుడు చంపేసి మొండె తలను వేరు చేసి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో పడేశాడు. సదరు బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నరబలి ఇచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బాలుడి మర్డర్ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి బాలుడిని నరబలి ఇచ్చిన తరువాత మృతదేహాన్ని దూరంగా పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడిని మరో బాలుడి చంపడంతో పాటు మొండెం, తలను వేరు చేయడమనేది నమ్మశక్యంగా లేదనిపిస్తోంది. బాలుడిని మీరట్ లో చంపారా? లేక ఇంటి దగ్గర చంపి మృతదేహాన్ని మీరట్ కు ఎలా తీసుకెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడిని చంపిన మరో మైనర్… మొండెం, తలను వేరు చేసి
- Advertisement -
- Advertisement -
- Advertisement -