Monday, December 23, 2024

దేఖో దేఖో షేర్ ఆయా… మోడీని చూసి జనం నినాదాలు

- Advertisement -
- Advertisement -

 

PM Modi targets Jawaharlal Nehru over Kashmir issue

సిమ్లా : త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు. ఉనాలో గురువారం ఉదయం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడానికి విచ్చేసిన ఆయనకు అభిమానులు, బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న చిన్నారులు, మహిళలు, వృద్ధులతోపాటు వేలాది మంది బీజేపీ జెండాలు పట్టుకొని రైల్వేస్టేషన్ వద్ద మోడీ కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు “మోడీ…మోడీ, జైశ్రీరాం” వంటి నినాదాలతో రైల్వే స్టేషన్ పరిసరాలను హోరెత్తించారు.

రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని రైల్వే ప్లాట్‌ఫాం నుంచి అలా నడుచుకొని వెళ్తూ జనానికి అభివాదం చేస్తుండగా, రెట్టింపు ఉత్సాహంతో దేఖో దేఖో కౌన్ ఆయా… షేర్ ఆయా.. (చూడు చూడు ఎవరు వచ్చారో… సింహం వచ్చింది) అంటూ మరింతగా నినదించారు. అనేక మంది అభిమానులు మోడీతో ఫోటోలు దిగుతూ .. వీడియోలు రికార్డు చేస్తూ కనిపించారు. మోడీ ప్రారంభించిన ఈ వందే భారత్ రైలు నాలుగోది కాగా, బుధవారం మినహా అన్ని రోజుల్లో సేవలందించనున్నది. ఈ పర్యటనలో మోడీ వెంట హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సాంకేతిక రంగంలో శరవేగంగా ప్రగతి

”ఆ వ్యక్తి” వల్లే చల్లారని కశ్మీరు చిచ్చు

దేశం లోనే తొలి సోలార్ గ్రామంగా మొధేరా: ప్రధాని మోడీ

భారత్‌లో 5జి సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News