Friday, November 22, 2024

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం

- Advertisement -
- Advertisement -

అయిజ : రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి రూ.1లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింనందున లబ్ధిదారులు కులం,ఆదాయం ధృవీకరణ పత్రాల జారీలో రెవెన్యూ అధికారులు నిర్లక్షం చూపుతున్నారని లబ్ధిదారు లు రెవెన్యూ కార్యాలయం ముందు ఎంఆర్వొ కారును అడ్డుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సమస్యను లబ్ధిదారులు రెవెన్యూ అధికారికి వివరిస్తూ కులం,ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని కొందరు దళారులను ఆశ్రయిస్తున్నారని, మీసేవా కేంద్రాలు అదే అదునుగా చూసుకుని వంద రూపాయలు ఖర్చు అయ్యె పత్రాలకు 5 వందల నుండి వెల వరకు డబ్బులు వసూళు చేస్తున్నారన్నారు.

ధృవీకరణ పత్రాల జారీలో నిర్లక్షం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో ఎంఆర్వొ కారును అడ్డుకుని నిరసన తెలుపగా జూలై 15వ తేది వరకు ప్రభుత్వం గడువు పెంచిందని లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని అధికారులు డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకుని రావాలని లబ్ధిదారులకు ఎంఆర్వొ సూచించారు. కానీ లబ్ధిదారులు ఆదోళన వీడక పోవడంతో కాలినడకన కార్యాలయానికి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News