Saturday, November 16, 2024

శాఖలమధ్య సమన్వయం లోపంతో జాప్యం అవుతున్న పరిశ్రమల తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం నుంచి తరలించాలన్న నిర్ణయం కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖల మధ్య సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదే సమయంలో, పారిశ్రామిక ప్రాంతాలు మరియు ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని కాదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం మొదలైన పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో బల్క్ డ్రగ్, ఆయిల్, ఇంటర్మీడియట్, ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు మరియు స్టీల్ విడిభాగాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి.

ఆయా పారిశ్రామిక వాడల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండా ఓపెన్ కెనాల్స్, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదలడంతో నీటి వనరులన్నీ కలుషితమయ్యాయి. నగర పరిధిలోని దాదాపు 100 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరినట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే తొలుత ఆయా పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య కారక కంపెనీలను తరలించాలని నిర్ణయించారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలుష్య పరిశ్రమలను దశలవారీగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) రెండేళ్ల కింద హడావుడి చేసింది. రెడ్, ఆరెంజ్ కేటగిరీల కింద అత్యంత కాలుష్య కారకమైన 500 కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. అలాగే మరో 600 బల్క్ డ్రగ్స్, ఫార్మా, అనుబంధ కంపెనీలను ముచ్చర్లలోని ఫార్మాస్యూటికల్స్‌కు తరలించాలని నిర్ణయించింది.

ఏడాదిలోగా జహీరాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు పరిశ్రమల తరలింపునకు అవసరమైన స్థలాలను గుర్తించినట్లు టిఎస్‌ఐఐసి అధికారులు తెలిపారు. నగరంలో సుమారు 1500కంపెనీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది, చాలా వరకు సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు, సమీప ప్రాంతాల నుండి వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఈ పరిశ్రమలు గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన, సల్ఫర్ ఉద్గారాలు కొన్ని ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదే సమయంలో నగరంలోని వందలాది చెరువులు, కుంటలు విష రసాయనాలతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు, వివిధ పరిశ్రమల నుండి ఘన మరియు ద్రవ వ్యర్థాలను డంప్ చేయడం వల్ల భారీ లోహాలు, మూలకాలు,పాదరసం, సీసం మరియు ఆర్సెనిక్ వంటి విష రసాయనాలు బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నాయి.కాలుష్య కారక పరిశ్రమలను నియంత్రిచేందుకు నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పక పాటిని ఎవరూ పాటించడం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

నదులు, కాలువలు, చెరువులు, కుంటల వెలుపల పారిశ్రామిక వ్యర్థాలను వేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి. సంబంధిత పరిశ్రమలను మూసివేసేలా ఆదేశాలు జారీ చేయాలి. ‘ కొత్తగా స్థాపించబడిన పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎఫ్లూయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. కాలుష్య ఉద్గారాలను అరిక్టందుకు చర్యలు తీసుకోవడానికి పిసిబి,టిఎస్‌ఐఐసి, రెవెన్యూ, పోలీస్ తదితర అధికారులతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలి. నదులు, చెరువులు, మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటిని పిసిబిసీ,జిహెచ్‌ఎంసీ, పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు అనుసంధానం చేసి పర్యవేక్షించాలి.హైదరాబాద్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలను అరిక్టందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. మార్గదర్శకాలను పాటించని కంపెనీలను మూసివేయాలని ఆదేశిస్తున్నాం,ఇప్పటికే కాలుష్య పరిశ్రమలను నగరం నుంచి వికారాబాద్, జహీరాబాద్, ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో ఏడాదిలోగా ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామంటూ చెబుతున్న అధికారుల మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News