Monday, January 20, 2025

పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారుల జాప్యం: సిఈవోను కలిసిన ఎస్టీయూ నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పోస్టల్ బ్యాలెట్ అంశంపై ఎస్టీయూ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో అధికారుల వైఖరిపై ఫిర్యాదు చేశారు. కొందరు రిటర్నింగ్ అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారని దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 2 వరకు ఓటు వేసే అవకాశం కల్పించడంతో పాటు డిసెంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించాలని కోరారు.

ఎన్నికల విధుల్లో 3.03 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటి వరకు 1.68 లక్షల మందికే పోస్టల్ బ్యాలెట్ అనుమతి ఇచ్చారని అందులోనూ చాలా మందికి ఇంకా బ్యాలెట్లు అందలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పోస్టల్ బ్యాలెట్ విషయంలో తలెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News