Saturday, November 16, 2024

లోక్‌సభ ఎన్నికల పరిశీలనకు 23 దేశాల ప్రతినిధుల రాక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబీలు) నుంచి 75 మంది అధికారుల బృందం భారత్‌ను సందర్శించనున్నట్లు భారత ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

భారత్ సందర్శించే ప్రతినిధులు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మోల్డోవా, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు,  పాపువా న్యూ గినియా , నమీబియా వంటి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ (IFES) సభ్యులు, భూటాన్, ఇజ్రాయెల్ నుండి మీడియా బృందాలు కూడా పాల్గొంటాయి.

మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ వంటి ఆరు రాష్ట్రాలను ఈ విదేశీ ప్రతినిధులు చిన్న సమూహాలుగా ఏర్పడి సందర్శిస్తారు, వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికలు , సంబంధిత సంసిద్ధతను పరిశీలిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News