Wednesday, January 22, 2025

మణిపూర్‌కు ‘ఇండియా’ ప్రతినిధుల బృందం

- Advertisement -
- Advertisement -

రెండు రోజు పాటు పర్యటించనున్న పార్లమెంటు సభ్యులు

హైదరాబాద్ : మణిపూర్ జరుగుతున్న పరిస్థితులను పరిశీలించేందుకు రెండు రోజుల పాటు ప్రతిపక్ష కూటమి ఇండియా తరుపున పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం వెళ్లుతుంది. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 16 పార్టీలకు చెందిన 20 ఎంపీలు బృందంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, పూలో దేవి నేతం, జేడీయూకు చెందిన రాజీవ్ రంజన్ సింగ్, అనిల్ ప్రసాద్ హెగ్దే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ గుప్తా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుష్మితా దేవ్ డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ నుంచి మహ్మద్ అఫ్టల్, ముస్లిం లీగ్ నుంచి మహ్మద్ బషీర్, శివసేన నుంచి అరవింద్ సావంత్, సీపీఎం నుంచి ఏ.ఏ. రహీం, సీపీఐ నుంచి పి. సంతోష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నుంచి జావెద్ అలీఖాన్, ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, ఆర్‌ఎస్పీ నుంచి ప్రేమచంద్రన్, ఆర్‌ఎల్డీ నుంచి జయంత్ సింగ్, వీసీకే పార్టీ నుంచి రవికుమార్, తిరుతోల్ తిరు మవలావన్, జేఎంఎం నుంచి మహువా మాజీ ఉన్నారు.

ఈ ప్రతినిధి బృందం మణిపూర్ లోని ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుంది. అక్కడ వివిధ వర్గాలను కలుసుకుని సహాయక శిబిరాలను కూడా దర్శించనుంది.

MPs delegation to Manipur

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News