Wednesday, January 22, 2025

ఓయూ సందర్శించిన తుర్కమెనిస్తాన్ ఎంబసీ ప్రతినిధి బృందం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంను తుర్కమెనిస్తాన్ ఎంబసీ ప్రతినిధి బృందం మంగళవారం సందర్శించింది. తుర్కమెనిస్తాన్ కాన్సుల్ సెక్రటరీ షాహ్ముహమ్మత్ ముహమ్మదేవ్, రాయబార కార్యాలయ ఛాన్సరీ హెడ్ మెయిలిస్ బాషిమోవ్ నేతృత్వంలోని బృందం ఓయూ విసి దండెబోయిన రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ఆచార్య రెడ్యానాయక్, విదేశీ విద్యార్థుల వ్యవహారాల డైరెక్టర్ ఆచార్య ఎల్. శివరామకృష్ణ, అదనపు డైరెక్టర్ ఆచార్య సరితారెడ్డి, డాక్టర్ టివిఎస్ లక్ష్మి, ఫర్హీన్ ల బృందంతో భేటీ ఆయ్యారు.

ఈ సందర్భంగా ఓయూలో విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌళిక వసతులను ఈ సందర్భంగా ఓయూ విసి, ప్రొఫెసర్ రవీందర్ వివరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి యూజీలో విద్యను అభ్యసించటానికి 18 మంది, పిజిలో 2 తుర్కమెనిస్తాన్ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారని ఆచార్య శివరామకృష్ణ వివరించారు. వివిధ దేశాలకు చెందిన మరో 50 మంది విద్యార్థులు ఓయూ పరిధిలో చదువుకుంటున్నారని వెల్లడించారు. విదేశీ విద్యార్థులకు సంబంధించిన విద్యాసంబంధిత అవకాశాలు, వసతులపై వివరణ ఇచ్చారు. అనంతరం తుర్కమెనిస్థాన్ విద్యార్థులు, ఓయూలోని ఎంబసీ సభ్యులు, అడ్మినిస్ట్రేషన్ సభ్యుల మధ్య పరస్పర చర్చా కార్యక్రమం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News