Monday, December 23, 2024

ముషీరాబాద్‌లో 20వేల ఓట్ల తొలగింపు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముషీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లను తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ సర్కిల్ డిప్యూటి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య తెలిపారు. 2022 జనవరి 5వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ వరకూ ఒకటి కంటే అధికంగా ఉన్న ఫోటో సెమిలారిటీ ఎంట్రీగా ఉన్న ఓటర్లను గుర్తించి తొలగించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో శుక్ర వారం ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా ఆఫ్‌లైన్ ద్వారా తీసుకుంటున్నట్టు తెలిపారు.

దరఖాస్తులు అత్యధికంగా ఆన్‌లైన్ ద్వారా అందుతున్నాయని అన్నారు. 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకూ ఒకే ఫోటో రెండు .. అంతకంటే ఎక్కువ సార్లు జాబితాలో ఉన్న వాటిని 19, 407 ఓటర్లు, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలకు 619 మంది ఓటర్లు షిఫ్టింగ్ అయినట్టు, ముగ్గురు ఓటర్లు మరణించినట్టు తెలియజేశారు. వీరందరి జాబితాను ఎన్నికల కమిషన్‌కు పంపగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించామని అన్నారు. 2023 జనవరి 5వ తేదీ నాటికి ముషీరాబాద్ నియోజకవర్గంలో 2, 80, 758 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న నమోదు నేపథ్యంలో 2,86,362 ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. వీరిలో 1,47,772 మంది పురుషులు, 1,38,577 మంది స్త్రీలు, 13 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు వివరించారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఓటర్ల జాబితాలో కూడా మరణించిన వాళ్లు, షిఫ్టింగ్ అయిన వాళ్లు, ఒకటి కంటే అదనంగా ఫోటోలు ఉన్న ఓటర్లను గుర్తించేందుకు బిఎల్‌ఓ, సూపర్‌వైజర్లు ఇంటింటికి తిరుగుతూ పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News